News October 13, 2025
కర్రెగుట్టల్లో CRPF ట్రైనింగ్ స్కూల్!

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని CRPF ప్లాన్ చేస్తోంది. ఇందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ తర్వాత అక్కడ IEDs, బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఎక్సర్‌సైజ్ చేపట్టాం. ఆ పని పూర్తికావచ్చింది. శాశ్వత స్థావరం ఏర్పాటు కోసం లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రా అంశాలను పరిశీలిస్తున్నాం’ అని చెప్పాయి.
Similar News
News October 13, 2025
ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో పలువురు అభిమానులను ఆయన కలిశారు. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే తరహాలో ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. పుష్ప సిరీస్‌తో అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
News October 13, 2025
వ్యాయామంతో క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్ట్స్‌కి చెక్

బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో భాగమైన రేడియోథెరపీతో పేషెంట్లు విపరీతమైన అలసటకు గురవుతారు. అయితే రెసిస్టెన్స్, ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే దీన్నుంచి త్వరగా కోలుకోవచ్చని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. వ్యాయామం కారణంగా చెడు ప్రభావాలు కనిపించలేదని స్టడీ వెల్లడించింది. కాబట్టి చికిత్స తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#Womenhealth<<>>
News October 13, 2025
200% టారిఫ్స్ వేస్తానని బెదిరించా: ట్రంప్

ఇండియా-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ‘టారిఫ్స్ ఆధారంగానే నేను కొన్ని యుద్ధాలను ఆపాను. ఇండియా-పాక్ వార్ విషయంలోనూ అదే చేశాను. 100%, 150%, 200% విధిస్తానని హెచ్చరించా’ అని తెలిపారు. 24 గంటల్లోనే ముగించానని చెప్పారు. సుంకాలతో భయపెట్టకపోతే ఘర్షణలు ఆగేవి కాదన్నారు. పీస్ సమ్మిట్ కోసం ఈజిప్టుకు బయల్దేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు.