News August 7, 2025

లోయలో పడ్డ CRPF వ్యాను.. ఇద్దరు జవాన్లు మృతి

image

జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మరణించారు. కద్వా-బసంత్‌గఢ్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 12 మందికి గాయాలయ్యాయి.

Similar News

News August 10, 2025

సిరాజ్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం

image

సిరాజ్‌ను కోహ్లీ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌పై అతనికున్న అభిమానమే అందుకు కారణం. ఇటీవల సిరాజ్ మేనేజర్ ‘BELIEVE’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అందులో గోడకు కోహ్లీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ జెర్సీ ఫ్రేమ్ కట్టించి ఉంది. అది చూసిన విరాట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సిరాజ్-కోహ్లీ బాండింగ్‌కు ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

News August 10, 2025

చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి

image

మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి. 1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి. వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.

News August 10, 2025

బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

image

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.