News February 12, 2025
దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు

TG: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దని మీసేవ సెంటర్లను ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News November 23, 2025
కామారెడ్డిలో కిలో చికెన్ రూ.240

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ ధర రూ.800, బోటి కిలో రూ.400, చికెన్ కిలో రూ.240- రూ.260, లైవ్ కోడి కిలో రూ.150గా నిర్ణయించారు. కార్తీక మాసం ముగియడంతో మాంసం అమ్మకాలు కాస్త పెరిగాయని వ్యాపారస్థులు తెలిపారు.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


