News April 10, 2025
దారుణం: పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూలులో అమానుష ఘటన జరిగింది. పీరియడ్స్ వచ్చాయనే కారణంతో 8వ తరగతి బాలికను క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి ప్రిన్సిపల్ 2 రోజులు పరీక్షలు రాయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి స్కూల్‌కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఇలా చేయడమేంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.
Similar News
News September 15, 2025
భారత్‌కు ఇబ్బందులు తప్పవు: US మంత్రి

ఏకపక్షంగా వెళ్తే భారత్‌కు వాణిజ్యం విషయంలో కష్టాలు తప్పవని US మంత్రి హోవార్డ్ లుట్నిక్ నోరు పారేసుకున్నారు. ‘భారత్ 140 కోట్లమంది జనాభా ఉందని గొప్పలు చెప్పుకుంటుంది. మరి మా మొక్కజొన్నలు ఎందుకు కొనరు? భారత్-US సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. విక్రయాలతో ప్రయోజనాలు పొందుతారు. మమ్మల్ని మాత్రం అడ్డుకుంటారు. మేము ఏళ్ల తరబడి తప్పు చేశాం. అందుకే ఇప్పుడు సుంకాల రూపంలో చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.
News September 15, 2025
సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు

1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య(ఫొటోలో) జననం
1892: గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
*జాతీయ ఇంజినీర్ల దినోత్సవం
*అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
News September 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.