News February 21, 2025
దారుణం: సుపారీ ఇచ్చి భర్తను చంపించింది!

ఢిల్లీకి చెందిన సోనూ, సరిత భార్యాభర్తలు. భార్యది రెండో వివాహం. గత కొంతకాలంగా వారిద్దరికీ గొడవలు నడుస్తున్నాయి. భర్తను అడ్డుతొలగిస్తే తప్ప మనశ్శాంతి ఉండదని భావించిన సరిత, 19 ఏళ్ల కుర్రాడికి సుపారీ ఇచ్చి హత్య చేయించింది. అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే ఆమె చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది.
Similar News
News February 22, 2025
WPL: ఆర్సీబీపై ముంబై గెలుపు

WPLలో ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన తాజా మ్యాచ్లో ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB పెర్రీ(81, 43 బంతుల్లో) చెలరేగడంతో 167 రన్స్ చేసింది. ఛేజింగ్లో బ్యాటర్లు హర్మన్ప్రీత్(50, 38 బంతుల్లో), సివర్ బ్రంట్(42, 21 బంతుల్లో) మెరుపులతో మరో బంతి మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.
News February 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 22, 2025
ఫిబ్రవరి 22: చరిత్రలో ఈరోజు

1847-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణం (కుడివైపు ఫొటో)
1866: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా వెంకటప్పయ్య జననం (ఎడమవైపు ఫొటో)
1944: కస్తూర్బా గాంధీ మరణం
1958: భారత తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం
1966: సినీ దర్శకుడు తేజ జననం
1983: దివంగత నటుడు నందమూరి తారకరత్న జననం
2019: సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం