News February 7, 2025
దారుణం.. రైల్లోంచి గర్భిణిని నెట్టేసిన దుండగుడు
తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News February 7, 2025
రేపటి లోగా బుమ్రా ఫిట్‌నెస్‌పై రిపోర్ట్!
భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News February 7, 2025
BCల జనాభా పెరిగింది: రేవంత్
TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని CM చెప్పారు.
News February 7, 2025
8 నెలల్లో రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు: TDP
AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. 34 ప్రాజెక్టుల ద్వారా రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీల్లో 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పూర్తి వివరాలను వెల్లడించింది.