News February 16, 2025
దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం

TG: సంగారెడ్డి(D) ఫసల్వాదిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని ఓ తండాకు చెందిన దంపతులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ నెల 2న అనంతపురం జిల్లాకు కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫసల్వాదిలోని ఓ విద్యాపీఠంలో భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయారు. పెయింటింగ్ పనులు చేసే మాథవన్ (34) భర్తను ఘోరంగా కొట్టి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News January 25, 2026
ATP: ‘గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి’

77వ గణతంత్ర దినోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పరేడ్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
News January 25, 2026
చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ అదేనా?

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జులై 10న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
News January 25, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


