News April 4, 2025

CS శాంతి కుమారికి రైతు కమిషన్ వినతి

image

ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతు హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చట్ట సవరణలు చేయాలని రైతు కమిషన్.. CS శాంతి కుమారికి నివేదిక అందించింది. వ్యవసాయ మార్కెట్, విత్తన చట్టాల్లో మార్పులు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ పేరులోనూ మార్పులు కోరింది.

Similar News

News October 25, 2025

సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు..!

image

రాబోయే పండుగలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 28, నవంబర్ 2న సికింద్రాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 30, నవంబర్ 4వ తేదీల్లో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రావడానికి అవకాశం కల్పిస్తున్నట్లు CPRO శ్రీధర్ పేర్కొన్నారు.

News October 25, 2025

HYD: ఉస్మానియా అండర్ గ్రౌండ్‌లో మార్చురీ నిర్మాణం

image

HYD గోషామహల్ గ్రౌండ్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఉన్నతాధికారుల బృందం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉస్మానియా నూతన ఆసుపత్రికి సంబంధించి పలు డిజైన్లను మార్చిన అధికారులు, భూగర్భంలో మార్చురీ నిర్మించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ప్రైమరీ ప్లానింగ్ రిపోర్టులో పేర్కొన్నారు.

News October 25, 2025

HYD: NIMSలో రూ.2,500కే డయాలసిస్..!

image

HYD పంజాగుట్ట పరిధిలోని NIMS హాస్పిటల్‌లో అధునాతన డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఉచితం కాగా మిగతా వారికి తక్కువ ఖర్చులోనే అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 5 షిఫ్టుల్లో దాదాపు 1,000 మందికి డయాలసిస్ చేస్తున్నారు. సుమారు 120 డయాలసిస్ యంత్రాలు అందుబాటులో ఉండగా, ఆరోగ్యశ్రీ లేనివారికి రూ.2,500కే డయాలసిస్ చేస్తున్నారు.