News April 4, 2025
CS శాంతి కుమారికి రైతు కమిషన్ వినతి

ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతు హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చట్ట సవరణలు చేయాలని రైతు కమిషన్.. CS శాంతి కుమారికి నివేదిక అందించింది. వ్యవసాయ మార్కెట్, విత్తన చట్టాల్లో మార్పులు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ పేరులోనూ మార్పులు కోరింది.
Similar News
News April 12, 2025
HYD: ఆస్తి కోసం కూతురి MURDER

మేడ్చల్ బోడుప్పల్‌లో ఆస్తి కోసం అమానుషం జరిగింది. సవతితల్లి లలిత, మరిది రవి, స్నేహితుడు వీరన్నలతో కలిసి మహేశ్వరి (26)ని హత్య చేసింది. పెళ్లి కానుకగా తండ్రి ఇల్లు ఇవ్వబోతున్నారన్న అక్కసుతో DEC 7న చున్నీతో గొంతు బిగించి హత్య చేసి, మృతదేహాన్ని వంగమర్తి వద్ద మూసీలో పాతిపెట్టారు. ఈ నెల 2న తండ్రి ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కి తరలించారు.
News April 12, 2025
HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News April 12, 2025
GHMC రికార్డు.. భారీగా TAX వసూళ్లు

TAX వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. బల్దియా చరిత్రలో తొలిసారి రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు అయ్యిందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పని చేశారన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు శుక్రవారం బంజారాభవన్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. OTS పథకంతో మంచి ఫలితాలు వచ్చాయని, 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.2,038 కోట్లకుపైగా వసూలయ్యాయని కమిషనర్ స్పష్టం చేశారు.