News May 21, 2024

అల్లర్లకు సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడు: టీడీపీ నేతలు

image

APలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించి ఉంటే సిట్ అవసరం ఉండేది కాదన్నారు. YCP తప్పుడు ఆరోపణలపైనా ఫిర్యాదు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ ప్రక్రియలో లోటుపాట్లను సీఈవో దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Similar News

News November 28, 2025

మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

image

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. ఎంత పుణ్యమో తెలుసా?

image

వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకు సంబంధించి టికెట్లను TTD నిన్న విడుదల చేసింది. ☞ వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 28, 2025

‘ఫ్రైస్వాల్’ ప్రత్యేకత.. ఒక ఈతలో 4వేల లీటర్ల పాలు

image

హోలిస్టిన్ ఫ్రీజియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన హైబ్రీడ్ ఆవు ‘ఫ్రైస్వాల్’. ఇది ఒక ఈత కాలంలో 4 వేల లీటర్ల పాలను ఇస్తుంది. దీనిలో అధిక పాలిచ్చే హెచ్.ఎఫ్. ఆవు గుణాలు 62.5%, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే సాహివాల్ ఆవు గుణాలు 37.5%గా ఉంటాయి. ఈనిన తర్వాత 300 రోజుల పాటు 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ICAR ప్రకటించింది.