News December 1, 2025

CSIR-IHBTలో ఉద్యోగాలు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Similar News

News April 3, 2026

సేతుపతి-సాయిపల్లవి మూవీ.. జూన్‌లో సెట్స్‌పైకి!

image

విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కించనున్న కొత్త మూవీ షూటింగ్ జూన్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు సమాచారం. మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ కానుంది.

News April 3, 2026

మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది గుర్తింపు: రేవంత్

image

TG గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో <<19551715>>సుప్రీంకోర్టు<<>> ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థను ప్రక్షాళన చేసి నియామకాలను పూర్తి చేసిన TGPSC ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

News April 3, 2026

హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

image

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.