News October 25, 2025

CSIR -NET దరఖాస్తు గడువు పొడిగింపు

image

రీసెర్చ్, లెక్చరర్‌షిప్ అవకాశం కల్పించే CSIR -NET దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. OCT 24తో అప్లై గడువు ముగియగా.. అభ్యర్థుల కోసం OCT 27 వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి OCT 25 ఆఖరు తేదీ కాగా.. OCT 28వరకు చెల్లించవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు OCT 29 నుంచి NOV 1 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. DEC 18న పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: nta.ac.in/

Similar News

News October 26, 2025

కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

image

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.

News October 26, 2025

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్‌సైట్:https://www.federalbank.co.in/

News October 26, 2025

ICC ర్యాంకింగ్స్‌లో రోహిత్ నం.1!

image

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానం దక్కించుకోనున్నారు. ప్రస్తుతం 745 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్ తాజా సిరీస్‌లో 202 రన్స్ చేయడంతో నం.1కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న ఐసీసీ అధికారికంగా ర్యాంకులను ప్రకటించనుంది. అటు గిల్ (768 పాయింట్లు), జర్దాన్ (764 పాయింట్లు) టాప్-2లో ఉన్నారు.