News April 14, 2025
CSK ఓపెనర్‌గా గుంటూరు కుర్రోడు

ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై తరఫున ఈరోజు ఆరంగేట్రం చేసిన గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా వచ్చి 19 బంతుల్లో 27(6 ఫోర్లు) పరుగులు చేశారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్ చేతికి చిక్కి అవుటయ్యారు. రూ.30లక్షలకు రషీద్‌ను చెన్నై సొంతంగా చేసుకోగా.. ఈ సీజన్‌లో అతనికిదే మొదటి మ్యాచ్.
Similar News
News April 15, 2025
గుంటూరు: 22 కేసుల్లో ముద్దాయి అరెస్ట్

2019 నుంచి గుంటూరు, నంద్యాల జిల్లాల్లో దారిదోపిడులు, దొంగతనాలు చేస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ గుడివద్ద పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతుతో పాటు అతడి ముఠా సభ్యులపై 22 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు.
News April 15, 2025
గర్భిణీలు ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యండి: DMHO

గుంటూరు DMHO కాన్ఫరెన్స్ హాలులో Dr. K. విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఆశా నోడల్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. DMHO మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రామ్‌ను గర్భిణీ, బాలింతల కోసం ప్రవేశ పెట్టిందన్నారు. గర్భిణీకి 4నెల నుంచి బిడ్డకు ఒక సంవత్సవరం వచ్చే వరకు కిల్కారి ఫోన్ కాల్స్ (01244451660/14423) లిఫ్ట్ చేస్తే పూర్తి సమాచారాన్ని వినగలుగుతారన్నారు. ఈ సేవలను బాలింతలు ఉపయోగించుకోవాలని కోరారు.