News March 26, 2026
CSK బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు.. ఓపెనర్స్ ఎవరంటే?

ఈ ఏడాది IPLలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్లు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. సంజూ శాంసన్, తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని కెప్టెన్స్ డే ఈవెంట్‌లో తెలిపారు. ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే ఓపెనర్‌గా దిగడం లేదని చెప్పారు. దీంతో అతను మూడో స్థానంలో, బ్రెవిస్ ఫోర్త్ ప్లేస్‌లో ఆడే అవకాశం ఉంది. కాగా గత సీజన్ ఆరంభంలో చెన్నై ఓపెనింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
Similar News
News April 5, 2026
ఆదుకొన్న నితీశ్, క్లాసెన్.. SRH స్కోర్ ఎంతంటే?

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో టాపార్డర్ కుప్పకూలినా SRH 156/9 స్కోర్ చేసింది. 7.1 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, ఐదో వికెట్‌కు క్లాసెన్(62), నితీశ్(56) 116 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్ 7, అభిషేక్ 0, ఇషాన్ 1, లివింగ్‌స్టోన్ 14 విఫలమయ్యారు. షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ తలో 2, దిగ్వేశ్, సిద్ధార్థ్ చెరో వికెట్ తీశారు.
News April 5, 2026
మెడలు పట్టి గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదు: ఈటల

TG: తాను BRSలోకి వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఎలాంటి తప్పు చేయకున్నా మెడలు పట్టి బయటకు గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదన్నారు. తనను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే BRS నుంచి బర్తరఫ్ చేశారని, అధికార బలంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయడం బాధించిందన్నారు.
News April 5, 2026
GK: నేషనల్ మారిటైమ్ డే విశేషాలు

* INDలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ‘SS లాయల్టీ’ నౌక 1919, APR 5న తొలిసారి ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది.
* ఆ రోజుకు గుర్తుగా ప్రభుత్వం 1964 నుంచి నేషనల్ మారిటైమ్ డేను నిర్వహిస్తోంది.
* దేశ సముద్ర తీరం పొడవు 11,098KM. 12 మేజర్, 217 మైనర్ పోర్టులున్నాయి.
* మొత్తం వాణిజ్యంలో 95% సముద్రాల ద్వారానే జరుగుతోంది.
* ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘సాగర్ సమ్మాన్’ అవార్డులిస్తారు.


