News March 17, 2024
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన CSK

ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని తమిళనాడులోని AIADMK పార్టీకి డొనేట్ చేసినట్లు ఈసీ పేర్కొంది. అలాగే CSK ఓనర్ ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.10 కోట్ల విలువచేసే బాండ్లను కొనుగోలు చేసి DMK పార్టీకి డొనేట్ చేసింది.
Similar News
News April 4, 2025
నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్

AP: ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరికి చెందిన 298 మందికి మంత్రి లోకేశ్ శాశ్వత ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అని, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువొస్తుందని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని ఆయన చెప్పారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవని తెలిపారు. భూగర్భ విద్యుత్, డ్రైనేజ్, గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడించారు.
News April 4, 2025
శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం: పొంగులేటి

TG: శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు. ధాన్యం తరుగు పెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామన్నారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు.
News April 4, 2025
ప్రధాని మోదీకి యూనస్ బహుమతి

బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఆయనతో బ్యాంకాక్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఫొటో ఫ్రేమ్‌ను మోదీకి యూనస్ బహుమతిగా ఇచ్చారు. 2015లో 102వ సైన్స్ కాంగ్రెస్ సభలో యూనస్‌కు మోదీ గోల్డ్ మెడల్ బహూకరించారు. ఆ ఫొటోనే యూనస్ ఫ్రేమ్ చేయించి గిఫ్ట్‌గా ఇచ్చారు. కాగా.. ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.