News March 23, 2025

ధోనీ రిటైర్మెంట్‌పై CSK కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

image

MS ధోనీ మరి కొన్నేళ్లు ఆడతారా? ఈ ప్రశ్నకు CSK కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర జవాబిచ్చారు. ‘51ఏళ్ల వయసులోనూ సచిన్ మాస్టర్స్ లీగ్‌లో ఎలా ఆడారో చూశాం. కాబట్టి ధోనీలో ఇంకా చాలా ఏళ్ల ఆట మిగిలి ఉందనుకుంటున్నా. 43 ఏళ్ల వయసులోనూ ఆయన జట్టుకోసం పడే కష్టం మా అందరికీ స్ఫూర్తినిస్తుంటుంది. జట్టులో తన పాత్రకు అనుగుణంగా వీలైనన్ని సిక్సులు కొట్టడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 24, 2025

BREAKING: తండ్రైన స్టార్ క్రికెటర్

image

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరు సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ కారణంగానే ఇవాళ IPL మ్యాచ్‌కు రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News March 24, 2025

ఒకే ఓవర్‌లో 6, 6, 6, 6, 4

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 30 బంతుల్లోనే 75 రన్స్ చేశారు. ఇందులో 7 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. స్టబ్స్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. మొత్తంగా 28 రన్స్ రాబట్టారు.

News March 24, 2025

ఓటీటీలో అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ5లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు 400M+ స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్లు మేకర్స్ వెల్లడించారు. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. థియేటర్లలో ₹300Crకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 1న OTTలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి హీరోయిన్లుగా నటించారు.

error: Content is protected !!