News April 29, 2024
రివేంజ్ తీర్చుకున్న CSK ఫ్యాన్స్

హైదరాబాద్పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ రివేంజ్ తీర్చుకున్నారు. గత మ్యాచ్లో SRH గెలవడంతో ‘సైలెన్స్’ అంటూ చెన్నై అభిమానులను హైదరాబాద్ ఫ్యాన్స్ నోరుమూయించారు. నిన్న CSK గెలవడంతో చెన్నై ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సైలెన్స్ అంటూ SRH ఫ్యాన్స్పై రివేంజ్ తీర్చుకున్నారు. స్టేడియంలో సీఎస్కే.. సీఎస్కే అంటూ నినదించారు. భీకర ఫామ్లో ఉన్న హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Similar News
News October 20, 2025
అందుకే చెడు సావాసం వద్దంటారు

నరకాసురుడిలో అసుర లక్షణాలు ఉన్నప్పటికీ బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం మొదలయ్యే దాకా అవి బయట పడలేదు. ఈ చెడు సావాసంతో అతనిలో రాక్షస ప్రవృత్తి పెరిగింది. దీంతో మునులను పీడించాడు. మదంతో అదితి కుండలాలను అపహరించాడు. కామంతో 16K రాజకన్యలను చెరపట్టాడు. అత్యాశతో లోకాన్ని జయించబోయాడు. అందుకే నరకాసురుడి వధ తప్పలేదు. చెడు స్నేహం మనలోని బలహీనతలకు బలమిచ్చి, పతనానికి దారి తీస్తుంది అనడానికి ఈ కథే నిదర్శనం.
News October 20, 2025
నరకాసురుడికి వరం ఎలా వచ్చింది?

నరకాసురుడు గొప్ప తపస్సు చేసి, బ్రహ్మదేవుడిని మెప్పించాడు. అమరత్వం కావాలని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ‘తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలో నీకు మరణం సంభవించదు’ అని వరం ఇచ్చాడు. భూదేవి తనకు మరణం కలిగించదని భావించిన నరకాసురుడు దుష్ట పాలన చేయసాగాడు. అయితే అది పరాకాష్ఠకు చేరింది. వరం కారణంగా అతణ్ని సంహరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. కృష్ణుడు, సత్యభామ ద్వారా నరకాసురుడిని అంతం చేయించి, ఆ వరాన్ని నిలబెట్టాడు.
News October 20, 2025
నరకాసురుడిని ఎందుకు చంపారు?

నరకాసురుడు భూలోక రాజులను ఓడించి, వారి సంపదలను అపహరించాడు. అతి క్రూరంగా 16 వేల మంది రాజకుమార్తెలను బంధించి, వారిని తన చెరసాలలో బంధించాడు. అహంకారంతో దేవతలకు, రుషులకు అపకారం చేశాడు. నరకాసురుడి బాధలు భరించలేక దేవతలు, రుషులు, బందీలుగా ఉన్న రాజకుమార్తెలు శ్రీకృష్ణుడిని రక్షించమని వేడుకున్నారు. ధర్మాన్ని, స్త్రీలను రక్షించడానికి శ్రీకృష్ణుడు అతనిపై యుద్ధం ప్రకటించాడు. సత్యభామ ఆ రాక్షసుడ్ని సంహరించింది.