News November 25, 2024

తెలుగు క్రికెటర్‌ను దక్కించుకున్న సీఎస్కే

image

ఐపీఎల్ మెగా వేలంలో ఏపీలోని గుంటూరు జిల్లా క్రికెటర్ షేక్ రషీద్‌ను చెన్నై కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే అతడిని దక్కించుకుంది. మరో తెలుగు ఆటగాడు అవనీశ్ ఆరవెల్లి అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఆయనను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అన్షుల్ కాంభోజ్‌ను సీఎస్కే రూ.3.40 కోట్లకు సొంతం చేసుకుంది.

Similar News

News November 12, 2025

టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి?

image

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

News November 12, 2025

విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

image

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

News November 12, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<>TISS<<>>) 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు రూ.125. వెబ్‌సైట్: https://tiss.ac.in