News December 6, 2024
బ్రాండ్ వ్యాల్యూలో సీఎస్కేనే టాప్

ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్‌లో సీఎస్కే అత్యధిక బ్రాండ్ విలువ కలిగి ఉంది. ఈ జట్టు బ్రాండ్ వ్యాల్యూ ప్రస్తుతం 122 మిలియన్ డాలర్లుగా ఉంది. 119 మిలియన్ డాలర్లతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఆర్సీబీ (117M), కేకేఆర్ (109M), ఎస్ఆర్‌హెచ్ (85M), ఆర్ఆర్ (81M), డీసీ (80M), జీటీ (69M), పీబీకేఎస్ (68M), ఎల్ఎస్‌జీ (60M) ఉన్నాయి.
Similar News
News November 24, 2025
నేరుగా రైతుల నుంచే కొనండి.. హోటళ్లకు కేంద్రం సూచన

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల ఉత్పత్తి సంస్థల (FPO) నుంచే కొనాలని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. సప్లై చైన్ నుంచి మధ్యవర్తులను నిర్మూలించడం ద్వారా రైతుల రాబడిని పెంచవచ్చని చెప్పింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) ట్యాగ్ ఉన్న ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సూచించింది. దేశంలో 35వేల FPOలు ఉన్నాయని, వాటిలో 10వేల వరకు ప్రభుత్వం స్థాపించిందని తెలిపింది.
News November 24, 2025
ఐబొమ్మ రవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

TG: ఐబొమ్మ రవి రాబిన్‌హుడ్ హీరో అని ప్రజలు అనుకుంటున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ అన్నారు. టికెట్ ధరలు పెంచి దోచుకోవడం తప్పనే భావనలో వారు ఉన్నారని తెలిపారు. ‘₹1000 కోట్లు పెట్టి తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని మరికొందరు అంటున్నారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి’ అని చెప్పారు.
News November 24, 2025
48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

మలేషియా-అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు చెప్పారు.


