News March 18, 2024
ఆ పార్టీకి రూ.5 కోట్ల విరాళాలు ఇచ్చిన సీఎస్కే యాజమాన్యం

ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు వచ్చిన విరాళాల జాబితాను ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK యాజమాన్యం మెజారిటీ విరాళాలను అందజేసింది. ఆ పార్టీకి రూ.6.05 కోట్లు విరాళాలు రాగా, వాటిలో సీఎస్కే యాజమాన్యమే రూ.5 కోట్లు ఇచ్చినట్లు ఈసీ గణాంకాలు పేర్కొన్నాయి. 2019 ఏప్రిల్‌లో ఈ విరాళాలు ఇవ్వడం గమనార్హం.
Similar News
News April 8, 2026
TMCపై EC పోస్ట్ వివాదం.. సమంజసమేనా?

‘ఈసారి బెంగాల్ ఎన్నికలు భయం, హింస, బూత్ జామింగ్ లేకుండా జరుగుతాయి’ అని EC చేసిన X పోస్ట్ వివాదాస్పదమైంది. నేరుగా TMCని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సమంజసమేనా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తప్పు జరిగితే స్వతంత్ర సంస్థగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి కానీ, రాజకీయ పార్టీల్లా విమర్శించడమేంటని నిలదీస్తున్నారు. ఓ రాజ్యాంగబద్ధ సంస్థ ఇలా పరిధి దాటి ప్రవర్తించడం సరికాదంటున్నారు. దీనిపై మీ COMMENT?
News April 8, 2026
ఆర్చర్ కాకముందు ఆర్టిస్ట్‌గా పాయల్

ఒడిశాకు చెందిన పారా ఆర్చర్ పాయల్ నాగ్ ఇటీవలే గోల్డ్ మెడల్ సాధించిన <<19578428>>విషయం<<>> తెలిసిందే. అయితే ఆమెలో మరో టాలెంట్ దాగి ఉంది. పాయల్ ఒకప్పుడు నోటితో పెన్సిల్ పట్టుకొని అద్భుతమైన చిత్రాలు గీసేవారు. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ కుల్దీప్ వేద్వాన్.. విలువిద్యలో శిక్షణ ఇచ్చారు. అలా 2023లో ప్రారంభించి కేవలం 2-3 ఏళ్ల కఠిన శిక్షణతో ‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్’లో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.
News April 8, 2026
ఎన్నికలకు ముందే ఓ సీటు కోల్పోయిన విజయ్ TVK!

దళపతి విజయ్ TVKకు ఎన్నికల ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గానికి బరిలో నిలిపిన అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. నామినేషన్‌లో మద్దతుగా సరిపడా సంతకాలు లేకపోవడమే కారణం. అరుణ్‌కుమార్‌కు ప్రత్యామ్నాయంగా TVK నిలబెట్టిన నిత్య అనే మరో అభ్యర్థి నామినేషన్ కూడా సేమ్ రీజన్‌తో రిజెక్ట్ అయింది. ఏప్రిల్ 6నే నామినేషన్ గడువు ముగియడంతో TVKకి ఓ సీటు కోల్పోయినట్లు అయింది.


