News March 25, 2024
జెర్సీపై ఆ లోగో లేకుండానే ఆడిన సీఎస్కే ప్లేయర్

బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. జెర్సీపై మద్యం కంపెనీ లోగోను వేసుకునేందుకు నిరాకరించారు. మతపరమైన కారణాలతో ఆయన ఈ లోగోను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో జెర్సీపై ఆ లోగో లేకుండానే బరిలోకి దిగారు. గతంలో ఆమ్లా, మొయిన్ అలీ వంటి ప్లేయర్లు కూడా ఇలాగే బరిలోకి దిగారు.
Similar News
News January 29, 2026
SBI 2273 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 29, 2026
తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 1/2

TG: KCRకు సిట్ నోటీసులతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. గత BRS హయాంలో ట్యాపింగ్ జరిగిందన్న ప్రభుత్వం రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. కేసు తొలుత SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టే తిరిగింది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో దర్యాప్తు నెమ్మదించింది. ఎట్టకేలకు ప్రభాకర్ రావును విదేశాల నుంచి రప్పించి సుదీర్ఘంగా విచారించారు. ఆయన స్టేట్మెంట్ల ఆధారంగా నాటి కీలక నేతలపై సిట్ ఫోకస్ చేసింది.
News January 29, 2026
తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 2/2

TG: ‘బిగ్ బాస్’ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామన్న నాటి అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కీలక నేతలను సిట్ విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను ప్రశ్నించింది. ఇప్పుడు కేసీఆర్కు నోటీసులతో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలన మలుపు తిరిగింది. అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆరే కావడంతో సిట్ ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది? KCR ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.


