News November 7, 2024

CSK అలా చేయకూడదు: ఊతప్ప

image

NZ క్రికెటర్ రచిన్ రవీంద్రను CSK అకాడమీలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ ఊతప్ప అభిప్రాయపడ్డారు. ‘ప్రాంచైజీలు దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మన జట్టుకు ప్రత్యర్థిగా ఆడే విదేశీ ప్లేయర్లకు ఇక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వొద్దు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడారు. IPLలేని సమయంలోనూ రచిన్ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల INDతో టెస్టుల్లో బ్యాట్‌తో రాణించారు.

Similar News

News December 27, 2024

మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్స్‌ఫర్డ్

image

ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో వ్యాపారులైన గురుముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు 1932 Sep 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పెషావర్‌లో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృత్‌సర్‌కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో DPhil పట్టా పొందారు.

News December 27, 2024

మన్మోహన్ ఫ్యామిలీ వివరాలు

image

మన్మోహన్ 1958లో గుర్‌శరన్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె 6 పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.

News December 27, 2024

మన్మోహన్ హోదాలు.. లెక్చరర్ టు ప్రధాని

image

✒ 1957-65 పంజాబ్ వర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్
✒ 1966-69 UNOలో వర్క్
✒ 1969-71 ఢిల్లీ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్
✒ 1972 కేంద్ర ఆర్థికశాఖ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
✒ 1976 ఆర్థికశాఖ కార్యదర్శి
✒ 1982-85 RBI గవర్నర్
✒ 1985-87 ప్రణాళికా సంఘం VC
✒ 1991లో యూజీసీ చైర్మన్
✒ 1991-96 ఆర్థిక మంత్రి; ✒ 2004-14 దేశ ప్రధాని