News March 14, 2025
ఫ్యాన్స్‌కి CSK జట్టు ఫ్రీ బస్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.
Similar News
News December 29, 2025
ఉత్తర ద్వార దర్శనం.. ఏ సమయంలో చేసుకోవడం ఉత్తమం?

వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామునే చేసుకోవడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఏకాదశి తిథి రేపు ఉదయం 7:51కి మొదలై, ఎల్లుండి పొద్దున5:01 వరకు ఉంటుంది. శాస్త్రరీత్యా డిసెంబర్ 30నే వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ శుభ దినాన ఏ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకున్నా.. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో చేసే ఈ దర్శనం అజ్ఞానాన్ని తొలగించి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.
News December 29, 2025
హైదరాబాద్‌లో 80 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News December 29, 2025
పిల్లల్లో మూర్ఛ ఉంటే ఏం చేయాలంటే?

మూర్ఛ వ్యాధి విషయంలో చాలా మంది అలర్ట్గా ఉండట్లేదని నిపుణులు అంటున్నారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చికిత్సను మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు కొనసాగించాలని సూచిస్తున్నారు. అప్పుడే 80-90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.


