News October 10, 2025
ఈ ప్లేయర్లను రిలీజ్ చేయనున్న CSK!

IPL-2026కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పలువురు ప్లేయర్లను <<17966400>>రిలీజ్<<>> చేయవచ్చని Cricbuzz తెలిపింది. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరన్, కాన్వేలను వదులుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై పర్సులో రూ.9.75 కోట్లు యాడ్ అయ్యాయి. అటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సహా శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, మహీశ్ తీక్షణలను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
Similar News
News October 10, 2025
IPS పూరన్ కుమార్ ఆత్మహత్యపై SIT

సీనియర్ IPS అధికారి <<17962864>>పూరన్ కుమార్<<>> ఆత్మహత్యపై హరియాణా ప్రభుత్వం ఆరుగురితో సిట్ ఏర్పాటు చేసింది. చండీగఢ్ ఐజీ పుష్పేంద్రకుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. SSP కన్వర్‌దీప్ కౌర్, ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జీత్ సింగ్, గుర్జీత్ కౌర్, జైవీర్ రాణా సభ్యులు. అన్ని కోణాల్లో సత్వర, నిష్పాక్షిక విచారణకు సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.
News October 10, 2025
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడటానికి సన్‌స్క్రీన్ వాడతాం. కానీ కొన్ని ఫార్ములేషన్లు ఆరోగ్యానికి హానికరమంటున్నారు నిపుణులు. కొన్ని సన్‌స్ర్కీన్లలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ అనేవి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, క్యాన్సర్ కారకాలని అంటున్నారు. అందుకే సన్‌స్క్రీన్ కొనేముందు లేబుల్స్ కచ్చితంగా చెక్ చెయ్యాలి.✍️ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.
News October 10, 2025
రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.166 కోట్లు విడుదల: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో కొత్తగా ఆయుష్ శాఖకు చెందిన 5 ఆస్పత్రులు, 3 కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధికి కేంద్రం రూ.166 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. ధర్మవరం, కాకినాడకు కొత్తగా ఆయుర్వేద కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్ఠ పరిచేలా బోధనా, బోధనేతర సిబ్బంది కోసం 500 పోస్టుల నియామకాలు చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు.