News April 11, 2025
‘పవర్ ప్లే’లో పవర్ చూపించలేకపోతున్న CSK

చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో(తొలి 6 ఓవర్లు) బ్యాటింగ్ పవర్ చూపించలేకపోతోంది. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యల్ప రన్ రేట్ (7.04) కలిగిన జట్టుగా కొనసాగుతోంది. ఇవాళ KKRతో మ్యాచులో పవర్ ప్లేలో 31/2 చేసిన CSK అంతకముందు మ్యాచుల్లో 62/1 vs MI, 30/3 vs RCB, 42/1 vs RR, 46/3 vs DC, 59/0 vs PBKS చేసింది. దీంతో ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన అవసరం ఉందని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 15, 2025
రెండో విడతలోనూ కాంగ్రెస్దే హవా

TG: రెండో విడత GP ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.
News December 15, 2025
కుంకుమ మన బలాన్ని పెంచుతుందా?

ఆలయాల ప్రాంగణంలో ప్రాణ శక్తికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రసరిస్తూ ఉంటాయి. ఈ ప్రకంపనలను కొన్ని వస్తువులు మాత్రమే గ్రహించగలవు. అందులో ‘కుంకుమ’ కూడా ఒకటి. ఇది గుడి పరిసరాల్లో ప్రసరిస్తున్న ఆ గాలిలోని ప్రాణశక్తిని గ్రహించి మన శరీరానికి పంపుతుంది. తద్వారా మన శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది. మొత్తంగా కుంకుమ దేవాలయ సానుకూల శక్తిని మనలోకి తీసుకువస్తుంది.
News December 15, 2025
IPLలో అదుర్స్.. T20Iల్లో చెత్త ప్రదర్శన

భారత ప్లేయర్లు సూర్య కుమార్, గిల్ ప్రదర్శన T20Iల్లో ఆందోళన కలిగిస్తోంది. IPL-2025లో సత్తా చాటిన ఈ ప్లేయర్లు, దేశం తరఫున పేలవ ప్రదర్శన చేస్తున్నారు. IPLలో సూర్య 65.18 సగటుతో 717 రన్స్, గిల్ 50 యావరేజ్తో 650 పరుగులు చేశారు. అయితే ఇండియా తరఫున మాత్రం స్కై 14.20 సగటుతో 213, గిల్ 24.25 సగటుతో 291 పరుగులే చేశారు. దీంతో ఈ ప్లేయర్ల స్థానంలో ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.


