News September 14, 2024
CSK తొలుత సెహ్వాగ్ను తీసుకోవాలనుకుంది: బద్రీనాథ్

IPL-2008 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం ధోనీని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్ను CSK తీసుకోవాలనుకుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ బద్రీనాథ్ తెలిపారు. కానీ అప్పటికే సెహ్వాగ్ ఢిల్లీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకున్నారని చెప్పారు. అలా అనుకోకుండా ధోనీ CSKలో అడుగుపెట్టారని పేర్కొన్నారు. ధోనీని జట్టులోకి తీసుకువచ్చేందుకు VB చంద్రశేఖర్దే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. IPL 2025లో ధోనీ ఆడేదీ లేనిదీ తెలియాల్సి ఉంది.
Similar News
News November 29, 2025
PHOTO: సిద్ద-శివ బ్రేక్ఫాస్ట్ మీట్

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం వేళ సిద్దరామయ్య, డీకే శివకుమార్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సిద్ద ఆహ్వానం మేరకు శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం ఏం మాట్లాడుకున్నారనేది తెలియాల్సి ఉంది. సీఎం కుర్చీపై వారిద్దరే తేల్చుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కుర్చీ వదులుకోవడానికి సిద్ద అంగీకరిస్తారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
News November 29, 2025
TG TET.. ఇవాళ ఒక్క రోజే ఛాన్స్

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు <
News November 29, 2025
శానిటేషన్ వర్కర్లను గౌరవించుకుందాం: GHMC

TG: మనం రోడ్లపై నడవ గలుగుతున్నామంటే అందుకు కారణం శానిటేషన్ వర్కర్లని GHMC పేర్కొంది. ‘సిటీ నిద్రపోతుండగానే పారిశుద్ధ్య కార్మికులు పని మొదలు పెడతారు. మనం పారేసే చెత్తను క్లీన్ చేస్తారు. డస్ట్, దుర్వాసన, ఎండలోనూ పని చేస్తారు. కానీ, చాలామంది వారితో అమర్యాదగా నడుచుకుంటారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచే వారి మర్యాదని కాపాడుదాం. నవ్వుతూ పలకరిద్దాం. శానిటేషన్ వర్కర్ల మర్యాదను కాపాడుదాం’ అని ట్వీట్ చేసింది.


