News October 20, 2024

రూ.4 కోట్లతో ధోనీని రిటెయిన్ చేసుకోనున్న CSK?

image

స్టార్ బ్యాటర్ ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటెయిన్ చేసుకోనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. ధోనీతో పాటు రుతురాజ్, జడేజా, శివమ్ దూబే, పతిరణను ఆ జట్టు రిటెయిన్ చేసుకోవచ్చని పేర్కొంది. గత ఏడాది కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముందని అంచనా వేసింది. సీఎస్కే గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు రాకుండానే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News December 5, 2025

ఒంటరితనంతో మహిళల్లో తగ్గుతున్న ఆయుష్షు

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో ఒంటరితనం పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా లోన్లీనెస్‌తో బాధపడుతున్న వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మహిళల DNA రక్షణ కవచంలోని కణాలు కుంచించుకుపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, ఇమ్యునిటీ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు.

News December 5, 2025

రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్‌ను ఫోర్స్ చేయలేదు: CBN

image

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.

News December 5, 2025

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>SAIL<<>>)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. నేటితో అప్లై గడువు ముగియనుండగా.. DEC 15వరకు పొడిగించారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in