News April 5, 2025

CSKvsDC: చెన్నై టార్గెట్ ఎంతంటే?

image

చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 183/6 స్కోర్ చేసింది. మెక్‌గుర్క్ డకౌట్ కాగా కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వీ 20, స్టబ్స్ 24* రన్స్ చేశారు. ఖలీల్ అహ్మద్ 2, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. విజయం కోసం చెన్నై 184 పరుగులు చేయాలి.

Similar News

News April 6, 2025

వరుసగా 3 రోజులు సెలవులు

image

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. అటు ఈనెల 10న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉంది. 18న గుడ్ ఫ్రైడే రోజు సెలవు ఉండనుండగా, 30న బసవ జయంతి రోజున ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా పేర్కొంది.

News April 6, 2025

నేడు ఉత్తరాఖండ్‌కు పొన్నం, సీతక్క

image

TG: మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నేడు ఉత్తరాఖండ్‌కు వెళ్లనున్నారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన రేపు, ఎల్లుండి డెహ్రాడూన్‌లో జరిగే చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొంటారు. BC సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై పొన్నం ప్రసంగించనున్నారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి సీతక్క వివరించనున్నారు.

News April 6, 2025

కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!

image

భూ కక్ష్యలో శకలాల ముప్పు నానాటికీ మరింత పెరుగుతోంది. ఉపగ్రహాలు తిరిగే వేగం కారణంగా ఒక సెం.మీ పరిమాణం ఉన్న వస్తువు ఢీకొట్టినా విధ్వంసం వేరేస్థాయిలో ఉంటుంది. భూ కక్ష్యలో అలాంటివి 12 లక్షలకు పైగా ఉన్నాయి. వీటి వల్ల ఒక ఉపగ్రహం ధ్వంసమైనా అది మిగతా శాటిలైట్లన్నింటినీ ధ్వంసం చేయొచ్చు. అదే జరిగితే భూమిపై సాంకేతికత అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

error: Content is protected !!