News March 18, 2024
CSKvsRCB: టికెట్స్ కోసం అశ్విన్ కష్టాలు

ఈనెల 22వ తేదీన IPL2024 మొదలుకానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్కు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ మొదలవగా విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ప్రారంభోత్సవ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలని తన పిల్లలు కోరుకుంటున్నట్లు RR ప్లేయర్ అశ్విన్ ట్వీట్ చేశారు. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్స్ దొరకలేదని, CSK సాయం చేయాలని కోరారు.
Similar News
News April 11, 2025
కెప్టెన్సీకి ధోనీ ఏమాత్రం సంకోచించలేదు: ఫ్లెమింగ్

చెన్నై టీమ్కు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు ధోనీ ఏమాత్రం వెనుకంజ వేయలేదని ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితిని ఆయనకు చెప్పగానే వెంటనే అర్థం చేసుకున్నారు. రుతు గాయపడిన నేపథ్యంలో తన స్థానంలో కెప్టెన్సీ చేయాలని కోరగానే ఏమాత్రం సంకోచించకుండా సరే అన్నారు’ అని పేర్కొన్నారు. మోచేతి గాయం కారణంగా ప్రస్తుత <<16058968>>కెప్టెన్ రుతురాజ్ సీజన్ మొత్తానికి<<>> దూరమైన సంగతి తెలిసిందే.
News April 11, 2025
విషాదం: NIT విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ జిల్లాలోని NITలో విషాదం చోటుచేసుకుంది. సంస్థలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి స్థానిక వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం హైదరాబాద్ కాగా ఎన్ఐటీ హాస్టల్లోనే నివాసముంటున్నాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2025
మాజీ ప్రియురాలిపై యువకుడి విచిత్ర ప్రతీకారం!

కోల్కతాలోని లేక్టౌన్ ప్రాంతంలో సుమన్ సిక్దర్ అనే యువకుడు మాజీ గర్ల్ఫ్రెండ్పై విచిత్రంగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో 4 నెలల వ్యవధిలో 300కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్ను ఆమె ఇంటికి బుక్ చేశాడు. ఆ డెలివరీలు తనకెందుకు వస్తున్నాయో తెలియక తీవ్ర ఒత్తిడికి గురైన యువతి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.