News March 20, 2025

‘CSR నిధులతో చెరువుల అభివృద్ధి’

image

ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. CSR నిధుల‌తో కార్పొరేట్, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ 72 సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు సూచించారు. చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌కే ప‌రిమితం కారాద‌ని, చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని సంస్థ‌ల‌కు సూచించారు.

Similar News

News March 28, 2025

బాపట్ల జిల్లాకు మంచి రోజులు..!

image

బాపట్ల జిల్లాకు నిన్న ఒక్కరోజే రెండు శుభవార్తలు అందాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. నిజాంపట్నం(M) పరిశవారిపాలెం(దిండి) వద్ద రూ.88.08 కోట్లతో ఆక్వా పార్కు ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ రూ.25.79 కోట్లతో చేపలు, రూ.18.58 కోట్లతో రొయ్యలు, రూ.9.88కోట్లతో పీతలకు బ్లాక్స్ నిర్మిస్తారు. అలాగే రూ.13.78 కోట్లతో సీ ఫుడ్ పార్కు ఇతర పనులు చేపడతారు.

News March 28, 2025

రేపు సూర్యగ్రహణం

image

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.

News March 28, 2025

తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

image

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.

error: Content is protected !!