News March 10, 2025
CT 2025: భారత ప్లేయర్ల ప్రదర్శన ఇలా..

☛ బ్యాటర్లు(రన్స్): శ్రేయస్ అయ్యర్ 243, విరాట్ కోహ్లీ 218, శుభ్‌మన్ గిల్ 188, రోహిత్ శర్మ 180, KL రాహుల్ 140.
☛ ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్ – 109 రన్స్+ 5 వికెట్స్, హార్దిక్ పాండ్య -99R + 4W, జడేజా- 27R + 5W
☛ బౌలర్లు (వికెట్లు): షమీ 9, వరుణ్ చక్రవర్తి 9, కుల్దీప్ 7, హర్షిత్ రాణా 4
Similar News
News March 10, 2025
క్రోమ్‌ను గూగుల్ అమ్మేయాల్సిందే: DOJ

క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మేయాలని గూగుల్‌కు DOJ మరోసారి స్పష్టం చేసింది. కోర్టు గత ఏడాది ఆదేశించినట్టుగా ఆన్‌లైన్ సెర్చ్‌లో అక్రమ గుత్తాధిపత్యానికి తెరదించాలని వెల్లడించింది. ఏ సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకోవాలన్న హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసింది. యాపిల్, మొజిల్లా సహా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్ ఒప్పందాలు చట్టవిరుద్ధమని తెలిపింది. 2021లో వీరికి గూగుల్ $26.3B ఇచ్చినట్టు ఆధారాలు దొరికాయి.
News March 10, 2025
సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

TG: తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాం. PCC, CM అనుమతి తీసుకొని నటిస్తా. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం’ అని పేర్కొన్నారు.
News March 10, 2025
రష్మిక మందన్నకు ప్రాణభయం: కొడవ వర్గం ఆందోళన

నటి రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని విమర్శించారు. ఆమెకు ముప్పు ఉందని, ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల KA <<15639271>>MLA <<>>ఒకరు ఆమెకు తగిన బుద్ధి చెప్తామని బెదిరించడం తెలిసిందే. KAలోని కొడగు ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యం. సంప్రదాయ హిందువులైన వీరు కొడవ భాష మాట్లాడతారు. రష్మిక ఈ వర్గానికే చెందుతారు.