News February 22, 2025
CT 2025: నేడు తలపడేది ఎవరంటే..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. రెండు జట్లకూ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. భారీ స్కోర్లు నమోదయ్యే లాహోర్ పిచ్పై ఈ పోరు జరగనుంది. ఆస్ట్రేలియాకు కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్, మార్ష్ వంటి స్టార్ల సేవలు దూరం కాగా.. ఇంగ్లండ్ భారత్ చేతిలో వైట్ వాష్ అయి పేలవంగా కనిపిస్తోంది. మరి రెండింటిలో ఏ జట్టు బోణీ కొడుతుందో చూడాలి.
Similar News
News December 5, 2025
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.
News December 5, 2025
వరి నారుమడిలో కలుపు యాజమాన్యం

వరి నారుమడిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు 5 సెంట్ల నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పైరజోసల్ఫ్యూరాన్-ఇథైల్ 10% W.P లేదా ప్రిటిలాక్లోర్+సేఫ్నర్ 20mlను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలాగే విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో బిస్పైరిబాక్ సోడియం 10% S.L 5ml కలిపి పిచికారీ చేయాలి.
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.


