News February 27, 2025

CT: గెలుపు రుచి ఎరుగని పాకిస్థాన్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం కూడా లేకుండా తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ఘోర ఓటమిపాలై, బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. పాక్ తలరాతను చూసి ఆ దేశ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కప్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదంటూ వాపోతున్నారు.

Similar News

News February 27, 2025

గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా?

image

గుడ్లు అంటే చాలామందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాలపాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంటపాత్రలో పగలగొట్టకూడదు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా వీటిలోకి చేరుతుంది. వేరే పాత్రలో ఫిల్టర్ చేశాకే ఉపయోగించాలి.

News February 27, 2025

దేశంలోనే తొలిసారి పిల్లులకు బర్డ్ ఫ్లూ!

image

కోళ్లకు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న వేళ మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లాలో దేశంలోనే తొలిసారి ఓ పెంపుడు పిల్లిలో ఈ H5N1 వైరస్ బయటపడింది. దీంతో మనుషులకూ సోకే అవకాశం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఆకృతి మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాణాంతకం కాదంటున్నారు. కాగా అమెరికా సహా పలు దేశాల్లో జంతువులు, మనుషులకూ ఈ వైరస్ సోకింది.

News February 27, 2025

అప్పుడు స్పందించకుండా ఇప్పుడు రాజకీయామా?: ఉత్తమ్

image

TG: SLBC ప్రమాదంపై BRS నేతల విమర్శలపై మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోతే, కాళేశ్వరం కూలి ఆరుగురు, పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదంలో ఆరుగురు చనిపోయినా వెళ్లలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే KCR కదల్లేదు. మాజీ సీఎం ఫామ్‌హౌస్ దగ్గర్లోని మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే స్పందించకుండా ఇప్పుడు రాజకీయమా?’ అని ధ్వజమెత్తారు.

error: Content is protected !!