News March 1, 2025

CT: దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ 179 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రూట్(37) ఫర్వలేదనిపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. SA బౌలర్లలో జాన్సెన్, మల్డర్ తలో 3, కేశవ్ 2, ఎంగిడి, రబాడ చెరో ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా టార్గెట్ 180. మరోవైపు దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు దాదాపు ఖరారైంది.

Similar News

News March 1, 2025

ఫార్మాసిటీలో ప్రమాదం.. విషవాయువులు లీక్

image

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విష వాయువులు లీకవడంతో వాటిని అదుపు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

సంక్రాంతికి వస్తున్నాం OTTలో చిన్న ట్విస్ట్!

image

ఇవాళ OTTలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రన్ టైమ్ తగ్గింది. థియేటర్‌లో 2గం. 24ని.లు స్క్రీన్ అయిన ఈ సినిమా జీ5లో 2గం. 16 ని.లే అందుబాటులో ఉంది. రన్ టైమ్ కారణంగా థియేటర్ వెర్షన్‌లో కట్ చేసిన కొన్ని సీన్లను OTTలో యాడ్ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే కొసరు మాట పక్కనబెడితే అసలుకే కత్తెరేశారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

ముదిరిన వివాదం.. 22న కర్ణాటక బంద్

image

మహారాష్ట్రలో KSRTC సిబ్బందిపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో వివాదం ముదిరింది. దాడులకు నిరసనగా ఈ నెల 22న కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 7న ఛలో బెళగావి, 11న అత్తిబెలె సరిహద్దు బంద్, 16న హోస్కెట్ టోల్ బంద్ చేస్తామని ప్రకటించాయి. త్వరలో బెంగళూరులో భారీ ర్యాలీ చేస్తామని తెలిపాయి. మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో KSRTC సిబ్బందిపై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!