News February 19, 2025

CT: విధ్వంస వీరుడి ఖాతాలో అత్యధిక రన్స్

image

మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు WI మాజీ ప్లేయర్ గేల్ పేరిట ఉంది. 17 మ్యాచుల్లో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 791 పరుగులు చేశారు. తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(742), ధవన్(701), సంగక్కర(683), గంగూలీ(665) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో కోహ్లీ(529), రోహిత్(481) పరుగులు చేశారు. మరి ఈ టోర్నీలో వీరు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడతారా? కామెంట్ చేయండి.

Similar News

News December 23, 2025

పాపం ఆ తండ్రి.. గౌరవం కాపాడాల్సిన కొడుకే..!

image

UPలోని దేవరియాలో తండ్రిపైనే కేసు పెట్టాడో కొడుకు. తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని PSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన దాని గురించి వివరించేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, క్షమించమని కొడుకును వేడుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఇంటికి రావడానికి అంగీకరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కొడుకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

News December 23, 2025

‘శిఖ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

image

‘శిఖ’- ఇది పవిత్రత, క్రమశిక్షణకు చిహ్నం. వేద నియమాల ప్రకారం.. తల శుభ్రం చేసుకున్నాక శిఖను మాత్రమే ఉంచుతారు. ఇది మన శరీరంలోని ‘సహస్రార చక్రం’ ఉన్న చోట ఉంటుంది. అలాగే దైవిక శక్తిని గ్రహించడానికి సాయపడుతుంది. స్నానం, నిద్ర, అంత్యక్రియల్లో తప్ప, మిగిలిన సమయాల్లో శిఖను విరబోయడం అశుభంగా భావిస్తారు. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే దీనిని ధరించడం, ముడివేయడం జీవనశైలిలో ఓ ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.

News December 23, 2025

ఇంటర్వ్యూతో CSIR-CECRIలో ఉద్యోగాలు

image

చెన్నైలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>CECRI<<>>)12 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24న ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. Sr.ప్రాజెక్ట్ అసోసియేట్, Sr.రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్- 2 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BE, B.Tech, ME, M.Tech, MSc(కెమిస్ట్రీ), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cecri.res.in/