News March 8, 2025
CT: ఫైనల్ మ్యాచ్‌కు టాస్ కీలకం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ తుది పోరుకు భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్‌నే క్యూరేటర్లు సిద్ధం చేశారు. స్లో, స్లగ్గిష్ పిచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్ ఛేదనకు కష్టంగా మారనుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా పాక్‌తో జరిగిన మ్యాచులో ఇండియా 244 టార్గెట్‌ను అతికష్టం మీద ఛేదించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్‌పోర్టు కోరింది.
News December 6, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్మెంట్లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.


