News August 25, 2024
CTR: ఆ మూడు చోట్ల నగరవనాల ఏర్పాటు
రాష్ట్రంలోని 11 నగరవనాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ రూ.15.4 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 3 నగరవనాలు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. పవన్ విడుదల చేసిన నిధులతో చిత్తూరు డెయిరీ వద్ద, కలగిరికొండ, శ్రీకాళహస్తి కైలాసగిరి వద్ద నగరవనాలను అభివృద్ధి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేలా పనులు చేస్తారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఇవి దోహదపడుతాయి.
Similar News
News September 15, 2024
కలికిరి: వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశ్రుతి
వినాయకుని నిమజ్జనం ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం కలికిరి చదివేవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల సమీపంలో వినాయకుని నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగసిపడి వెల్డింగ్ షాపు దగ్ధమైంది. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు అంటుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది. వెల్డింగ్ షాపులో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.
News September 15, 2024
అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి
నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈలు విజయ్ కుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తరితరులు పాల్గొన్నారు.
News September 14, 2024
తిరుపతి: స్పా సెంటర్ పై పోలీసుల దాడి
తిరుపతిలోని శ్రీనివాసం వెనుక వైపు డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో ఓ లాడ్జీ పై ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాడ్జీ పైన ఉన్న 7 స్పా సెంటర్ పై దాడి చేశారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలను, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.