News December 20, 2024

CTR: ఇద్దరు యువకుల ప్రాణం తీసిన అతివేగం

image

చిత్తూరు- తవణంపల్లె రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ కళాశాల విద్యార్థులు స్పోర్ట్స్ బైక్‌పై అతివేగంతో బస్‌ను ఓవర్‌టేక్ చేస్తుండగా.. బైకు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో విద్యార్థులు హర్ష(17), సాయితేజ(18)కు తీవ్ర రక్తస్రావమై కోమాలోకి వెళ్లారు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు.

Similar News

News February 5, 2025

చిత్తూరు: 19 నుంచి టెక్నికల్ పరీక్షలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష (లోయర్, హయ్యర్ గ్రేడ్) పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షల షెడ్యూల్ WWW. bre.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నట్లు తెలిపారు.

News February 5, 2025

కుప్పం: రహదారుల అభివృద్ధికి రూ.53.35 కోట్లు మంజూరు

image

కుప్పం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి కోసం ఆర్‌ఐడిఎఫ్ గ్రాంట్ కింద రూ.53.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని 23 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

News February 4, 2025

కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7.85 కోట్లు

image

శాంతిపురం (M) రాళ్లబూదుగూరులో నెలకొని ఉండు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.85 కోట్లను మంజూరు చేసింది. కుప్పం ప్రాంతంలో అత్యంత పురాతన ఆలయంలో ఒకటైన శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

error: Content is protected !!