News June 5, 2024
CTR: ఎక్కడి నుంచి వచ్చామని కాదు..!

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. బాపట్లకు చెందిన ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నాన్ లోకల్ అయిన ఆయన లోకల్‌గా ఉన్న వైసీపీ అభ్యర్థి రెడ్డప్పని 2.20 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇకపై ఆయన జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని దగ్గుమళ్ల అనుచరులు చెబుతున్నారు.
Similar News
News July 9, 2025
చిత్తూరు: జగన్ పర్యటనపై DSP సూచనలు

బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనపైన DSP సాయినాథ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మహేశ్వర్, నెట్టికంటయ్యలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జగన్ పర్యటనలో తప్పనిసరిగా పోలీసులు విధించిన ఆంక్షలు పాటించాలన్నారు. 500 మంది రైతులు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పదు అన్నారు.150 మందికి నోటీసులు జారీచేశామన్నారు.
News July 8, 2025
చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తే సహకారం అందజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
News July 8, 2025
చిత్తూరు: వారి మధ్య నలుగుతున్నది పోలీసులే!

మామిడి రైతుల సమస్యల చుట్టూ జిల్లా రాజకీయం తిరుగుతుంది. పరిశ్రమలు వారు రూ. 8, ప్రభుత్వం రూ. 4, మొత్తం రూ.12 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు న్యాయం చేయడం లేదని YCP బదులిస్తుంది. ఇటీవల YS జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. నిజానికి ఇరు పార్టీల రాజకీయం నడుమ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చర్చించుకుంటున్నారు.