News April 29, 2024
CTR: కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఇవాళ సాయంత్రం ముగియనుంది. ఈక్రమంలో పలువురు అభ్యర్థులు ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని పార్టీల తరఫున డమ్మీ సెట్లు వేసిన వాళ్లు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఈక్రమంలో చిత్తూరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయానందరెడ్డి భార్య ఇందుమతి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
Similar News
News April 14, 2026
చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.
News April 14, 2026
చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
News April 14, 2026
చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.


