News April 5, 2024
CTR: న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ

చిత్తూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్)గా నియమిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న అడిషనల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వెన్నెలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News November 16, 2025
కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

కర్ణాటక అత్తిబెలే సమీపంలో మిస్సయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబెలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకుప్పం(M) ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.
News November 16, 2025
చిత్తూరు DRO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి బుధ, గురువారాల్లో HODలతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని DRO మోహన్ కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి గ్రీవెన్స్ల పరిష్కారంపై దృష్టిసారించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 15, 2025
పవన్ పర్యటనతో ఒరిగిందేమి లేదు: వేంకటే గౌడ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మండిపడ్డారు. ఏనుగుల క్యాంపునకు వచ్చిన ఆయన ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఉంటే వారి బాధలు తెలిసేవన్నారు. కనీసం ఏనుగు దాడిలో గాయపడ్డ సుకుమార్ పక్కనే ఉన్నా పలకరించలేదన్నారు. పార్టీ క్యాడర్ కూడా లోపలికి రానివ్వకపోవడం దారుణమన్నారు.


