News August 15, 2024
CTR: మహిళల స్నానం వీడియోలతో బెదిరింపులు

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పలమనేరు పట్టణం గంటావూరు కాలనీలో బాలు అనే యువకుడు మహిళలు స్నానాలు చేసే సమయంలో వీడియోలు తీస్తున్నాడని బాధితులు వాపోయారు. కాలనీలోని బహిరంగంగా ఉండే స్నానపు గదుల్లో ఈ పనులు చేస్తున్నాడని ఆరోపించారు. సంబంధిత వీడియోలు చూపించి మహిళలను బెదిరిస్తున్నాడని తెలిపారు. గతంలో ఓసారి మందలించినా తీరు మారకపోవడంతో పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 15, 2025
కుప్పం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం కావడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 9000716436, 80740 8806 నంబర్కి సమాచారం తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.
News November 14, 2025
అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస

పెద్దపంజాణి(M) <<18282463>>అప్పినపల్లి<<>> వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy.CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయన్న ఆయన ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.
News November 14, 2025
ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యం: SP

ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ధృడ సంకల్పమని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. డయల్ 112 విభాగాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కాల్ ఎంతో ముఖ్య ఉంటుందని చెప్పారు.


