News June 29, 2024
CTR: మామిడి రైతులకు సూచనలు

ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.
Similar News
News October 19, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.
News October 19, 2025
నేడు చిత్తూరులో ముగింపు సమావేశం

జీఎస్టీ తగ్గింపు వల్ల వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై నెలరోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. నేడు జీఎస్టీ 2.0 ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే భవన్‌లో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.
News October 19, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.137 నుంచి రూ.144, మాంసం రూ.199 నుంచి 215 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.226 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.