News January 18, 2025
CTR: రైలుకు ఎదురెళ్లి YCP నాయకుడి ఆత్మహత్య

చిత్తూరు జిల్లా సదుం మండలం చింతలవారిపల్లెకు చెందిన వైసీపీ ఉపసర్పంచి దేవందర్ రెడ్డి(54) నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మృతి ఆత్మహత్య అని తేలింది. గురువారం రాత్రి బైకుపై పూతలపట్టుకు వెళ్లారు. విల్లుపురం-తిరుపతి రైలుకు ఎదురెళ్లడంతో చనిపోయారు. లోకో పైలెట్ గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్ఐ ప్రవీణ్ మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 9, 2025
నేటి నుంచి కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు

కుప్పం-బెంగళూరు మధ్య నేటి నుంచి యధావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కుప్పం రైల్వే ట్రాక్ పనుల కారణంగా గడిచిన 15 రోజులుగా కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కుప్పం ప్రాంతానికి చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
News February 8, 2025
చౌడేపల్లి: ప్రమాదం జరిగితే గానీ స్పందించరా..?

చౌడేపల్లి సోమల మార్గంలోని డ్యాం వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో కల్వట్టు కుంగడంతో గుంత ఏర్పడింది. వాహనదారులు ఆదమరిస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగితే గానీ స్పందించరానంటూ ప్రజలు ప్రయాణికులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
News February 8, 2025
చిత్తూరు: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

రైలులో గర్భిణిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన జోసెఫ్ భార్య 4నెలల గర్భిణి. ఆమె కోయంబత్తూరు- TPT ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పుట్టినిల్లు చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి బయలు దేరింది. వేలూరు జిల్లాకు చెందిన హేమరాజ్(28) మహిళా బోగిలో ఎక్కి ఆమె ఒంటరిగా ఉండడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశాడు.