News December 30, 2024

CTR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News January 23, 2025

తిరుమలలో ముగిసిన అధ్యయనోత్సవాలు

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ‌తేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. 25 రోజులుగా శ్రీవారి శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు.

News January 23, 2025

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్

image

76వ భారత గణతంత్ర వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.  ఈ నెల 26న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

News January 22, 2025

తిరుపతి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి నగరంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన జయ కన్నన్ ఈనెల 21న తిరుపతిలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకున్నారు. 22న సిబ్బంది తలుపు తట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూడగా పడకపైనే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ మహేశ్ చెప్పారు.