News September 12, 2024
CTR: వినాయకుడికి ముస్లిం సోదరుల పూజలు

చిత్తూరు జిల్లాలో ముస్లిం సోదరులు వినాయకుడికి పూజలు నిర్వహించి వారెవ్వా అనిపించారు. పులిచెర్ల మండలం కె.కొత్తకోటకు చెందిన ముస్లిం సోదరులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఏడు దేవతామూర్తులు ఉన్న గుడిలో గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఇలా మతసామరస్యం చాటిన ఆ సోదరులను అందరూ అభినందిస్తున్నారు.
Similar News
News November 17, 2025
చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్‌కు మస్త్

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్‌కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్‌ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.

చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.