News September 12, 2024

CTR: వినాయకుడికి ముస్లిం సోదరుల పూజలు

image

చిత్తూరు జిల్లాలో ముస్లిం సోదరులు వినాయకుడికి పూజలు నిర్వహించి వారెవ్వా అనిపించారు. పులిచెర్ల మండలం కె.కొత్తకోటకు చెందిన ముస్లిం సోదరులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఏడు దేవతామూర్తులు ఉన్న గుడిలో గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఇలా మతసామరస్యం చాటిన ఆ సోదరులను అందరూ అభినందిస్తున్నారు.

Similar News

News October 5, 2024

మదనపల్లె: ఒంటరి మహిళపై బండరాళ్లతో దాడి

image

పాత కక్షలతో ప్రత్యర్థులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వితంతు మహిళపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మదనపల్లె మండలం రాయనిచెరువు వడ్డీపల్లిలో జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి అదే ఊరిలో ఉండే గంగులప్పకు ఇంటి విషయమై గొడవలున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మిపై గంగులప్ప వర్గీయులు బండరాళ్లతో శుక్రవారం రాత్రి దాడిచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 5, 2024

చిత్తూరు: తండ్రి బైక్ నడుపుతుండగా కింద పడి బిడ్డ మృతి

image

తండ్రి బైక్ నడుపుతుండగా అదుపు తప్పి కింద పడి బిడ్డ మృత్యువాత చెందిన విషాదకర ఘటన శుక్రవారం రాత్రి గుర్రంకొండలో జరిగింది. ఎస్సై మధు రామచంద్రుడు వివరాల మేరకు.. తంబళ్లపల్లె మండలం కోటకొండకు చెందిన బాబు తన కుమార్తె మేఘన(19)ని గుర్రంకొండలోని బంధువుల ఇంటికి తీసుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తుండగా.. గాలివీడు రోడ్డులో బైకుపై నుంచి పడి మేఘన అక్కడికక్కడే మృతి చెందింది.

News October 4, 2024

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(BED) మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.