News April 24, 2024

CTR: సమోసాలు అమ్మే వ్యక్తి నామినేషన్

image

చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా K.బాషా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆయన సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నిన్న మదనపల్లెలో బజ్జీలు విక్రయించే మహిళ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

Similar News

News February 11, 2026

చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

image

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

News February 11, 2026

వెల్ఫేర్ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్‌లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్‌పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.