News June 5, 2024

CTR: ఎక్కడి నుంచి వచ్చామని కాదు..!

image

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. బాపట్లకు చెందిన ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నాన్ లోకల్ అయిన ఆయన లోకల్‌గా ఉన్న వైసీపీ అభ్యర్థి రెడ్డప్పని 2.20 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇకపై ఆయన జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని దగ్గుమళ్ల అనుచరులు చెబుతున్నారు.

Similar News

News July 7, 2025

బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద భక్తులపై హిజ్రాల దాడి

image

బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులపై హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం ఆటోలో వచ్చారు. బోయకొండ వద్ద ఆటోలు ఆపిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అడిగినంత ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ఈ దాడిలో ఐదుగరు గాయపడగా.. వారు చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 6, 2025

తవణంపల్లిలో రోడ్డు ప్రమాదం

image

తవణంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మాధవరం వెళుతున్న ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో అరగొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌‌తో డ్రైవర్ పరారయ్యాడు. మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.