News July 1, 2024

CTR: నేడు 5.4 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 2.71 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ 181.02 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. పూతలపట్టు మండలంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు. మరోవైపు తిరుపతి జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.182.33 కోట్లను అందజేయనున్నారు. మొత్తంగా 5.4 లక్షల మందికి రూ.363.05 కోట్లు పంపిణీ చేస్తారు.

Similar News

News July 3, 2024

TDP నాయకుల వేధింపులకు యువకుడి బలి: YCP

image

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అయ్యవార్లగొల్లపల్లెలో కేశవ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కేశవ తల్లికి పింఛన్ ఆపేసి టీడీపీ నాయకులు వేధించారు. అతి తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్షన్ అడిగిన కొడుకును టీడీపీ బలితీసుకుంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కడుపు నొప్పి భరించలేక తన సోదరుడు పురుగు మందు తాగాడని కేశవ అన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 3, 2024

తిరుపతిలో DSCకి ఉచిత శిక్షణ

image

తిరుపతిలోని స్టడీ సర్కిల్లో డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, సాధికారత అధికారి రబ్బానీబాషా వెల్లడించారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సంప్రదించాలని కోరారు.

News July 3, 2024

చిత్తూరు: జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలి

image

కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో మంగళవారం ట్రైనింగ్ సెంటర్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కల్పించాలన్నారు. అక్రమ రవాణా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.